శశివదనా స్తబకం

  1. హరిలలనే మే పథి తిమిరాణి ।
    హర దరహాస ద్యుతిభి రిమాని ॥

    ఓ ఇంద్రాణీ ! నా మార్గమందున్న యీ చీకట్లను నీ మందహాస కాంతులచే తొలగింపుము.
  1. అగతి మవీర్యా మపగత ధైర్యాం ।
    అవతు శచీమే జనిభువ మార్యాం

గతి చెడి, వీర్యము గోల్పోయి, అధైర్యముజెందిన నా పవిత్రజన్మభూమిని శచీదేవి రక్షించుగాక.

  1. శ్రుణు కరుణావ త్యలఘుమఖ ర్వే ।
    స్తవ మహమార్య స్తవ శచి కుర్వే ॥

    ఓ శచీ! ఆర్యుడనగు నేను శ్రేష్ఠమైన నీ స్తవము జేయుచుంటిని. వినుము.
  1. త్రిజగ దతీతో విలసతి నిత్యః ।
    అణు రణుతో, యో భగవతి సత్యః

    ఓ భగవతీ ! సత్యస్వరూపుడైన యెవడణువుకంటే నణువగు చుండెనో, త్రిజగదతీతుడగు నాతడు నిత్యము ప్రకాశించు
  1. త్వ మఖల కార్యే వ్వయి ధృత శక్తిః ।
    ఉరుగతి రస్య ప్రభుతమ శక్తిః

    ఓ దేవీ! సర్వకార్యములందు ధరించబడు శక్తి గలిగి, త్వరిత గతి గలదాననై నీవీ ప్రభునకు మిగుల సమర్ధమైన శక్తివి.
  1. విదురిమ మేకే జగతి మహేంద్రం ।
    జగురయి కేచి జ్జనని మ హేశం ॥

    ఓ తల్లీ! జగత్తునందు కొందఱీ పురుషుని మహేంద్రుడని తెలియుచున్నారు, మఱికొందఱు మహేశ్వరుడని గానము చేయుచున్నారు.
  1. అవగత వేదో వదతి మహేంద్రం
    పరిచిత తంత్రో భణతి మహేశం ॥

    వేద విదులు మహేంద్రుడందురు, తంత్రశాస్త్ర పరిచితులు మహేశ్వరుడందురు
  1. జనని శచీ త్వం ప్రథమ దళస్య ।
    భగవతి దుర్గా స్యపర దళస్య ॥

    ఓ తల్లీ ! నీవు మొదట చెప్పబడినవారికి శచీ దేవి వగుచుంటివి, రెండవవారికి దుర్గవగుచుంటివి.
  1. న శచి శివాత స్త్వ మితర దైవం ।
    బహు ముని వాణీ సమరస తైవం ॥

    ఓ శచీ దేవీ ! నీ వందువలన శివవే కాని యితర దైవమవు కావు. ఇట్లనుట బహుమునుల వాణి ననుసరించి యుండును.
  1. దివిచ సితాద్రౌ శచి వపుషోర్వాం !
    పృథ గుపలంభా దయి భిదయోక్తిః ।

ఓ శచీ! స్వర్గ, కైలాసములందు మీరు (శచీ, దుర్గలు) వేఱ్వేరు శరీరములను ధరించుటవలన మీకు భేద మూహింపబడుచున్నది.
(స్వర్గమనగా నాకము = న + అకము = దుఃఖము లేనిది యైనను కైలాసము మోక్షస్థానముగా నెంచబడుచున్నది. సుషుప్తికి సమాధికి గల సంబంధమువంటిదని పౌరాణిక భావము. కాని యివి యొకే లోకమునకు వైదిక తాంత్రిక పరిభాషలందున్న పేళ్ల భేదము. తేజస్సునుబట్టి యొకరు, శబ్దమునుబట్టి యొకరు కల్పించిరి.)

11. తనుయుగ మూలం వపురతి మాయం ।
కరచరణాద్వై ర్వియుత మమేయం ||

మాయకతీతమైనది, కరచరణాది విహీనమైనది, యమేయ మైనది యైన శరీరము పై రెండుశరీరములకు మూలమైయుండెను. (ఈ రెండు శరీరములు ఆకాశ సంబంధములు, వీనికి మూల మైనది సచ్చిదానంద స్వరూపము. సృష్టికొఱకాకాశ శరీరము ధరింపబడుట శ్రుతిప్రసిద్ధము. దీనినే సగుణ బ్రహ్మలక్షణ మందురు.)
  1. త్వముదరవర్తి త్రిభువన జీవా ।
    భవసి శచీ సా జనని శివా వా ॥

    ఓ తల్లీ! ఉదరమందిమిడించుకొనిన త్రిభువనములకు నీవు జీవమునై శచివైతివి. ఆ నీవే దుర్గగా కూడ నుంటివి.
13. విభుశుచికీలాతతిరయి ధూమమ్ ।
త్వమమరమార్గం బత వమసీమమ్

దేవీ ! శుద్ధాగ్నియైన విభునియొక్క కిరణ సమూహమవై నీవు దేవయానమను ధూమమును గ్రక్కితివి. ఆశ్చర్యము.

(విభుడు మూలమందు సచ్చిదానందస్వరూపుడైనను సృష్టికొఱకు వ్యాపకత్వధర్మ మును జెంది విభుడనబడెను. విభుడనగా వ్యావకుడు. వ్యాపకత్వధర్మ మతని మహిమ.ఆ మహిమ మతనియందుద్గరలీనములను జెందుచు సృష్టిప్రళయములకు కారణమగుచుండును. ఉద్గార మనెడి వికాసమును బొందినప్పు డచలమైన స్వరూపవస్తువు మహిమావంతమై తన యుపరిభాగములందు వ్యాపకత్వలక్షణముచే నూక్ష్మ ధూమసదృశమైన రజస్సగుచు, మహిమ యొక్క విజృంభణమువలన అగ్నినుండి కక్కబడు సూక్ష్మధూమమువలె విభునిస్వరూపము నుండి యది క్రక్కబడుచున్నది. ఈవిధముగా ఆనందస్వరూపవస్తువు తనకుతానే తనమహిమచే విషయలక్షణముగా వ్యాపించి ఆకాశనామమును బొందెనుగావున ఆకాశమానందము కాకపోదను నర్థముగల ప్రతివాక్కు (యదేష ఆకాశ ఆనందో నస్యాత్ ) వ్యాఖ్యానమగును. ఈ యాకాశము సూక్ష్మమైనను దానిని వ్యాపింపజేయు మహిమ దానికంటెను సూక్ష్మమై దానికంతరమున నున్నట్లు మఱువరాదు. అంతరమున కేవలమైయున్న శుద్ధత్వదశ చెప్పబడును; ఆకాశముతోగూడి వ్యాపించునప్పుడు విషయత్వదశ చెప్ప బడును ; ఈ రెండుదశలకు నడుమ నెక్కడ ఆకాశమును బొందుచు విడుచుచు నున్నటు లుండునో ఆ సంధి సంధానప్రాంతమందు మహిమ జ్వలించు చున్నందున దానికక్కడ తేజస్త్వదశ చెప్పబడును. ఈ విధముగా శుద్ధత్వ తేజస్త్వ విషయత్వదశలచే జ్వాలారూప మున వ్యాపించిన మహిమ కాశ్రయుడైన విభుడు శుద్ధాగ్నితోడను, విషయలక్షణముగా వ్యాపించిన సూక్ష్మ రజోభూతాకాశము ధూమముతోడను పోల్చబడెను. రెండింటికి నడుమ నున్న తేజస్త్వసంధిభాగము విషయమును వేఱుచేయుచు ఆనందస్వరూపముతో సంధాన మొవర్చు చున్నందున దుఃఖములేని ప్రాంతముగా నెంచబడి నాక మనబడెను. (నాకము = న + అకము = దుఃఖములేనిది). ఇది కాంతులకు మార్గమైనందున ముక్తికి మార్గమగు దేవయాన మనియు పిలువబడుచున్నది (దివ్ కాంతి). ఇది రజోమయాకాశమనెడి ధూమమున కంతరముననుండి దాని సంబంధముచే దేవయానధూమ మనబడెను. ఆట్లే అకాశపరముగా పరమాకాశమనియు పిలువబడుచున్నది. దీని నధిష్ఠించినది సచ్చిదానంద స్వరూపమైనను, అధిష్ఠాన లక్షణమువలన కవులా స్వరూపమును శక్తిపురుషులుగా విభజించి పల్కిరి. ఆ శక్తి పురుషులే ఇంద్రాణీ యింద్రులని గ్రహించవలెను.)

  1. జయసి నభస్తో జనని పరస్తాత్ ।
    నభసిచ భాంతీ భవసి పురస్తాత్ ॥

ఓ తల్లీ ! నీవాకాశమున కావల (అనగా పరమాకాశము లేదా కేవల మహిమగా) ప్రకాశించుచు, నాకాశమందును దాని కీవలను (అనగా గోళాకృతులుగా రూపొందిన విశ్వమందును) గూడ నుంటివి.

  1. త్వ మతనురంబ జ్వలసి పరస్తాత్ ।
    ఇహ ఖ శరీరా లససి పురస్తాత్ ॥

    ఓ తల్లీ ! ఆవల నీవశరీరవైజ్వలించుచు, ఆకాశమందును దాని కీవలనున్న గోళప్రపంచమందును గూడ ఆకాశ శరీరిణి వై ప్రకాశించు చుంటివి.
  1. జనని పరస్తా న్మతిరసి భక్తుః ।
    అసి ఖ శరీరా పృథగవగంత్రీ ॥

    ఓ తల్లీ ! నీ వావల భర్తకు మతి వై యుంటివి. అకాశ శరీరిణి వై నీవు ప్రత్యేక చలన శక్తిగానుంటివి.
  1. సువిమల రూపం భగవతి శాంతం ।
    న భవతి శూన్యం తదిద మనంతం

    ఓ తల్లీ ! నీ నిర్మల స్వరూపము శాంతమైనను, శూన్యము మాత్రము కాదు. ఇచ్చటి (ఆకాశ) రూప మనంత మైయున్న ది.
  1. దివి దధతీంద్రే పురుషశరీరం ।
    జనని పురంధ్రీ తనురభవ స్త్వం॥

    ఓ తల్లీ ! నీ వాకాశములో నింద్రునియందు పురుష శరీరమును ధరించి, నీవు స్త్రీ శరీరిణి వై తివి.
  1. దృశి విలసంతం ప్రభు ముపయాంతీ!
    భవసి విరాట్ త్వం నృతనుషు భ్రాంతీ

    ఓ తల్లీ ! దృక్కులలో విలసించు ప్రభువుతో గలసి నీవు మాన వులందు బ్రకాశించుచు ‘విరాట్’ వైతివి.
  1. తవ గుణగానం జనని విధాతుం ।
    భవతి పటుః కో వియదివ మాతుం ॥

    ఓ తల్లీ ! ఆకాశమును కొలత జేయుట శక్యము గాన ట్లే నీ గుణగానము చేయుట యెవరికిని శక్యముకాదు.
  1. భగవతి తృప్తి ర్భవతు నవా తే ।
    అభిలషి తాప్తి ర్భవతు నవా మే ॥

    ఓ భగవతీ ! నీకు దృష్తియగుగాక, కాశపోవుగాక, నాకోర్కె సిద్ధించుగాక, మానుగాక ;
  1. భజతి తవాంఘ్రిం మమఖలు భాషా ।
    పతి మనురాగా త్ప్రియమివ యోషా ॥

    ప్రియ భర్తనను రాగముతో భార్య విడువనట్లు, నా భాష నీ పాదమును విడువక భజించును గదా. (పాదమనగా అంశయగు నాకాశ రూపమునకును అన్వయించును. ఆకాశము శబ్ద గుణము కలది. గావున భాషచే భజింప బడునట్టిదగును.)
  1. అఘ మపహర్తుం శుభమపి కర్తుం ।
    అల మజ రే తే గుణగణ గానం ॥

    దేవీ ! నీ గుణ గణగానము పాపములను నశింప జేయుటకును శుభముల నిచ్చుటకును సమర్ధమైనది.
  1. అవసి జగత్త్వం కులిశి భుజస్థా ।
    అవ మునిభూమిం గణపతి ధీస్థా ॥

    ఓ తల్లీ ! ఇంద్రుని భుజములందుండి (భుజశక్తిగా) నీవు జగత్తులను రక్షించు చుంటివి, గణపతి బుద్ధియందట్లే నీ వుండి భారత భూమిని రక్షింపుమా.
  1. శశివదనాభి ర్గణపతిజాభిః ।
    శశివదనాద్యా పరి చరితాస్తు ॥

    గణపతి కవివలన బుట్టిన యీ ‘శశివదనా’ వృత్తములచే నాది శక్తియైన యింద్రాణి సేవింపబడుగాక.