ప్రస్తావన

శివనామ జపము చేయుచు
శివరాత్రిని గడుప నేను శివశతకంబున్
శివ సంకల్పము తోడుత
కవనార్చనమనగ నీకు గావింతు శివా!
ముందుగ గణపతిఁ గొలిచియు
అందంబగు నమ్మ చరణమంటియుఁ దలతో
కందములే కుందములన
పొందిక పద్యములఁగూర్చి పొగడెదను శివా!
చిన్మయమగు చైతన్యము
ఉన్మనియౌ కళగ లోన నుద్దీప్తంబై
మన్మనమున భాసింపగ
తన్మయతను నిన్ను నేను తలచెదను శివా!