హంసమాలా స్తబకము

  1. సురుచిర్వజ్రపాణేస్సుదృశో మన్దహాసః ।
    హరతాన్మోహమూలం హృదయస్థం తమో మే ॥

    మిగుల కాంతిమంతములగు ఇంద్రాణీ మందహాసములు మోహ కారణమైయున్న నా హృదయమందలి యజ్ఞానమును నశింపజేయుగాక.
  1. అమృతం సఙ్కిరన్త్యా ప్రసరన్త్యేహ దృష్ట్యా ।
    సురరాజ్ఞీ బలాఢ్యాం భరతక్ష్మాం కరోతు ॥

    అమృతమును జిమ్ముచు, నీ లోకమందు ప్రసరించు ఇంద్రాణీ దృష్టి (వెన్నలతో పోలిక) భారతభూమికి బలమిచ్చుగాక.
  1. అమృతామ్భః కిరన్తీ కరుణామ్భో వహన్తీ ।
    నతరక్షాత్తదీక్షా శచి మాతస్తవేక్షా ॥

    ఓ తల్లీ ! అమృతోదకమును జిమ్మునట్టిది, కారుణ్యోదక మును వహించునట్టిది, నమ్రులను రక్షించుటకు దీక్ష బూనినది నీ చూపగుచున్నది.
  1. కృతపీయూషవృష్టిస్తతకల్యాణసృష్టిః ।
    విహితైనోవినష్టిర్ధృతవిజ్ఞానపుష్టిః ॥

    అమృతమును సృష్టించునట్టిది, మంగళములను నిర్మించునది, పాపములను ధ్వంస మొనర్చునది, విజ్ఞానమును బోషించునది,
  1. భృతదేవేన్ద్రతుష్టిర్యమినాం దేవగృష్టిః ।
    మమ కామ్యాని దేయాత్తవ విశ్వామ్బ దృష్టిః ॥

    దేవేంద్రునకు సంతుష్టి గలిగించునది, నియమము గలవారికి కామ ధీరువు ( దేవగృష్టి) వంటిదియైన నీ దృష్టి నా కోర్కెలను దీర్చుగాక.
  1. జగతాం చక్రవర్తిన్యసితస్తే కటాక్షః ।
    జలదో భక్తిభాజాం శిఖినాం నర్తనాయ ॥

    ఓ తల్లీ ! నీ నల్లనైన కటాక్షము భక్తులనెడి నెమిళ్ల నాట్యము కొఱకు మేఘమగుచున్నది.

(కారు మేఘము నెమిళ్లకు ప్రీతియై నాట్యమునకు బ్రే రేపించును. భక్తులు నెమిళ్లతోడను, దేవీ కటాక్షము కాటుక కంటి సంబం ధమై కాసమేఘముతోడను పోలిక.)

  1. సుకృతీ కోఽపి నాట్యే బహులే తత్ర మాతః ।
    జగతే సారభూతానుపదేశాన్కరోతి ॥

    ఓ మాతా ! విస్తారమైన ఆ నాట్యములో నొకానొక పుణ్య పురుషుడు జగత్తుకొఱకు శ్రేష్ఠమైన ఉపదేశము జేయును. (ఇది దేవీ కటాక్ష, ప్రేరణమున చేయబడునని భావము. శ్రీరమ ణోప దేశమును కవి ధ్వనింపజే సెను. )
  1. అపరో నవ్యకావ్యాన్యనవద్యాని ధన్యః ।
    విదధాత్యప్రయత్నాద్బుధభోగక్షమాణి ॥

    ధన్యుడగు మఱియొకడు పండితుల యాస్వాదము కొఱ కప్రయ త్నముగా ననింద్యమైన నూత్న కావ్యములను రచించును.) (కవి తనయం దా దేవీ కటాక్షము బొందిన కార్యరూపమును బేర్కొ నెను.)
  1. ఇతరో భాగ్యశాలీ రమణీయైః ప్రసఙ్గైః ।
    వితనోతి స్వజాతిం జగతి శ్రేష్ఠనీతిమ్ ॥

    భాగ్యశాలియైన నింకొకడు రమ్య ప్రసంగములచే జగత్తునందు తమ జాతివారిని శేషమైన నీతిమంతులుగా చేయును. (కల్నల్ ఆల్కాటుదొర ధ్వనించుచుండెను.)
  1. జగతాం మాతరేకో మహసా పుణ్యశాలీ ।
    విధుతారిః స్వదేశం కురుతే వీతపాశమ్ ॥

    ఓ మాతా! పుణ్యాత్ముడైన వేతొకడు తన తేజస్సుచే శత్రు వులను బారదోలి, నిజ దేశమును దాస్యబంధమునుండి విడి పించుచున్నాడు. (గాంధీమహాత్ముడు.)
  1. పర ఇన్ద్రాణి సాధుర్బత విస్మృత్య విశ్వమ్ ।
    రమతే సిక్తగణ్డః ప్రమదాశ్రుప్రదానైః ॥

ఓ యింద్రాణీ ! సాధువైన మఱియొకడు విశ్వమును మరచి యానంద బాష్పములచే తడుపబడిన చెక్కిళ్లతో క్రీడించు చుండును. ఆశ్చర్యము ! (అరవిందుడు)

  1. తవ రాగార్ద్రదృష్ట్యా దివి శక్రస్య నాట్యమ్ ।
    కరుణాసిక్తదృష్టయా భువి భక్త్స్య నాట్యమ్ ॥

    ఓ దేవీ ! నీ యనురాగ దృష్టిచే స్వర్గమందు దేవేంద్రునకు నాట్యము, నీ కరుణార్ద్ర దృష్టిచే భూమియందు భక్తునకు నాట్యము అగును.
  1. తవ సప్రేమదృష్టిర్బలమిన్ద్రే దధాతి ।
    తవ కారుణ్యదృష్టిర్బలమస్మాసు ధత్తామ్ ॥

నీ దృష్టి ప్రేమతోగూడి యింద్రునకు బలమిచ్చును, కారుణ్య ముతో గూడి మాకు బలమిచ్చునుగాక.

  1. తవ వామాః కటాక్షాః ప్రభుమానన్దయన్తు ।
    ఉచితో దక్షిణానామయమస్త్వీక్షణానామ్ ॥

    నీ వామ (వక్ర,రమ్య) కటాక్షము లింద్రుని యానంద పర చును. నీ దక్షిణ (ఉదార) కటాక్షములకు ఈ జను డుచితుడగుగాక.
  1. సుకృతానాం ప్రపోషం దురితానాం విశోషమ్ ।
    కరుణార్ద్రా విభాన్తీ తవ దృష్టిః క్రియాన్నః ॥

    కరుణతో బ్రకాశించు నీ చూపు మా పుణ్యముల నభివృద్ధి పరచి, మా పాపములను క్షయము చేయుగాక.
  1. కురు పాదాబ్జబన్ధోః సరణిం నిస్తమస్కామ్ ।
    శచి విజ్ఞానతేజః కిరతావీక్షితేన ॥

    ఓ శచీ! విజ్ఞాన తేజస్సును బ్రసరింపజేయు నీ చూపు నీ పాదా బ్దములను నమ్మియున్న నా మార్గమును తమస్సు లేనిదిగా నొనర్చుగాక.
  1. క్రియయారాధయన్తో భువనే తే విభూతీః ।
    ఇహ కేచిల్లభన్తే తవ మాతః కటాక్షాన్ ॥

    ఓ తల్లీ ! భువనమందుగల నీ విభూతులను క్రియచే నారాధించు కొందఱు నీ కటాక్షము నీ లోకములోనే పొందుచున్నారు.
  1. స్ఫుటవిజ్ఞానపూర్వం ప్రభజేరన్ యది త్వామ్ ।
    స్థిరయా దేవి భక్త్యా కిము వక్తవ్యమీశే ॥

    దేవీ ! స్థిర భక్తితో స్ఫటమైన విజ్ఞానముతో నిన్ను భజించు వారుకూడ నీ కటాక్షమును బొందుదురని వేతే చెప్పనేల?
  1. కువిధేర్విస్మరన్తీ భరతక్ష్మా శచి త్వామ్ ।
    బహుకాలాదభాగ్యే పతితా దేవ్యయోగ్యే ॥

    ఓ శచీ ! దురదృష్టమువలన నిన్ను మరచిన భారతభూమి చాల కాలమునుండి అయోగ్యమై, యభాగ్యదశకు పతనమయ్యెను.
  1. అభిషిక్త్స్య మాతా తవ తేజోంశభూతా ।
    సుదశాం సేవమానామనయత్పశ్చిమాశామ్ ॥

    అభిషిక్తుని తల్లియై (విక్టోరియా రాణి), నీ తేజోంశవలనజన్మించిన యామె తనను సేవించు పశ్చిమవాసులను మంచి దశకు తెచ్చెను.
  1. అయి కాలం కియన్తం దయసే పశ్చిమస్యామ్ ।
    ఇత ఇన్ద్రాణి పూర్వామవలోకస్వ దీనామ్ ॥

    ఓ యింద్రాణీ ! ఎంతకాలము పశ్చిమ దిక్కుపట్ల దయగా నుందువు. ఈ దీనురాలైన పూర్వదిక్కును చూడుమా.
  1. న వయం పశ్చిమస్యాశ్శచి యాచామనాశమ్ ।
    కృపయైతాం చ పూర్వాం నిహతాశామవాశామ్ ॥

    ఓ శచీ ! మేము పశ్చిమదిక్కు యొక్క నాశమును యాచించ లేదు. నిరాశజెందియున్న పూర్వదిక్కును కృపతో రక్షింతువని మాయాశ.
  1. సకలం వ్యర్థమాసీదయి దీనేషు దృష్టా ।
    తవ విశ్వస్య మాతః కరుణైకావశిష్టా ॥

    ఓ తల్లీ ! ఈ దీనుల విషయమై సమస్తము వ్యర్ధమైపోయెను. చూడగా, సీ దయయొక్కటి మిగిలియున్నది.
  1. సురరాజస్య కాన్తే నరసింహస్య సూనుమ్ ।
    బలవన్తం కురు త్వం భరతక్ష్మావనాయ ॥

    ఓ తల్లీ ! నీవు నరసింహ సూనుడగు గణపతిని భరతభూమి రక్షణకొఱకు బలముగలవానిగా జేయుము.
  1. రుచిరాభిర్నిజాభిర్గతిభిర్హర్షయన్తు ।
    మరుతాం భర్తురేతాస్తరుణీం హంసమాలాః ॥

    ఈ హంసమాలా వృత్తములు మనోహరమగు స్వకీయగతుల చే నింద్రాణిని సంతోషపరచుగాక.