మదలేఖా స్తబకం

1. పౌలోమ్యాః పరిశుభ్రజ్యోత్స్నాదృశ్యరుచో మే ।
శ్రీమన్తో దరహాసాః కల్పన్తాం కుశలాయ ॥

పరిశుభ్రమైన 'నెన్నెలవలె గన్పట్టు కాంతులు గల్గి ప్రకాశించు ఇంద్రాణీ దరహాసము నాకు క్షేమము కొఱక గుగాక.
2. కారుణ్యామృతసిక్తా శక్తా శక్రమహిష్యాః ।
ప్రేక్షా భారతభూమేర్దౌర్బల్యం విధునోతు ॥

దయ యనెడి యమృతముచే తడుపబడు నట్టిది, శక్తిమంత మైనది యగు ఇంద్రాణీ వీక్షణము భారతభూమియొక్క దౌర్బ ల్యమును హరించుగాక.
3.వన్దే నిర్జరరాజ్ఞీం సఙ్క్ల్పే సతి యస్యాః ।
సాధ్యాసాధ్యవిచారో నైవ స్యాదణుకోఽపి ॥

ఏ దేవి సంకల్పించినప్పుడు సాధ్యాసాధ్య విచారము లేశమైన నుండదో, అట్టి దేవికి నేను నమస్కరింతును.
4. సఙ్క్ల్పస్తవ కశ్చ్చిచత్తే చేద్దివ ఈశే ।
స్యాదుల్లఙ్ఘ్య నిసర్గం సిద్ధిర్నిష్ఫలతా చ ॥

ఓ స్వర్గాధీశ్వరీ ! నీవు సంకల్పించినచో సిద్ధి, నిష్ఫలత యను నవి తమ నైసర్గిక స్థితి సతిక్రమించియైనను జరిగితీరును.
5. మూఢోఽప్యుత్తమరీత్యా సిధ్యేదధ్యయనేషు ।
మేధావీ చ నితాన్తం నైవ స్యాత్కృతకృత్యః ॥

నీ సంకల్పమునుబట్టి మూఢుడైనను, నుత్తమరీతిని విద్యలందు సిద్ధి బొందును. అత్యంత మేధావియైనను, కృతకృత్యుడు కాజాలడు.
6. ఉత్పద్యేత మహేశ్వర్యప్రాజ్ఞాదపి శాస్త్రమ్ ।
యాయాన్మాతరకస్మాద్విభ్రాన్తిం విబుధోఽపి ॥

ఓ తల్లీ ! నీ సంకల్పాను సారము మూఢునివల్ల శాస్త్రముత్ప న్నము కావచ్చును, పండితుడైనను అకస్మాత్తుగా భ్రాంతి బొందవచ్చును.

7. అల్పానామబలానాం సఙ్గ్రామే విజయః స్యాత్ ।
శక్తానాం బహులానాం ఘోరా స్యాత్పరిభూతిః ॥

బలహీనులై కొలదిమంది యున్నను సంగ్రామమందు విజయ మొందవచ్చును, చాలమందియుండి శక్తిమంతులైనను ఘోరాపజయము బొందవచ్చును.
8. రాజేరన్నృపపీఠేష్వఖ్యాతాని కులాని ।
స్యాద్దుర్ధర్షబలానాం పాతో రాజకులానామ్ ॥

కీర్తిలేని వంశములు నృపవీఠమందు బ్రకాశించుచు, మిగుల బలముగల రాజకులములు నశించవచ్చును.
9. నిర్యత్నోఽపి సమాధేర్విన్దేద్దేవి సమృద్ధిమ్ ।
యోగస్యామ్బ న పశ్యేదభ్యస్యన్నపి సిద్ధిమ్ ॥

ఓ దేవీ! యత్నము జేయనివాడుగూడ పూర్ణసమాధి బొంద వచ్చును, అభ్యసించుచున్నను యోగస్థితి నొకడు పొందక పోవచ్చును.
10. అత్యన్తం యదసాధ్యం నేదిష్ఠం భవతీదమ్ ।
సాధ్యం సర్వవిధాభిః స్యాదిన్ద్రాణి దవిష్ఠమ్ ॥

ఓ యింద్రాణీ ! ఏది యత్యంత అసాధ్యమో, అది సమీపము గావచ్చును; సర్వవిధముల సాధ్యమైనది దూరముగావచ్చును.
11. గాయామో మునిసఙ్ఘైర్గేయాం కామపి మాయామ్ ।
ఇన్ద్రస్యాపి వినేత్రీం త్రైలోక్యస్య చ ధాత్రీమ్ ॥

ముని సంఘములచే గానము చేయబడునది, యింద్రునిగూడ శాసించునది, త్రిలోక జనని యగు నొకానొక మాయను మేముగానము చేయుచుంటిమి.
12. విద్యానామధినాథే కాం విద్యాం శ్రయసే త్వమ్ ।
ఇన్ద్రం కర్తుమధీనం విశ్వస్మాదధికం తమ్ ॥

సకల విద్యాధీశ్వరీ ! ఓ తల్లీ ! విశ్వముకంటె నధికుడైన ఆ యింద్రుని నశ మొనర్చుకొనుటకు నీవే విద్య నాశ్రయించితివి?
13. నిత్యాలిర్మినీషే స్త్రీమోహో న వితర్క్యః ।
భ్రూచేష్టానుచరత్వాదన్యా స్యాదనుకమ్పా ॥

ఓ దేవీ ! స్త్రీ మోహ మూహింపనలవిగానిది. నీ కనుబొమ్మల చేష్టల కనుచరుడగుటవలన నీ వతనియందు చెప్పనలవిగాని దయ జూపియుందువు.
14. సౌన్దర్యం పరమన్యద్వజేరద్దర్యథవా తే ।
హర్తుం యత్సుఖమీష్టే తాదృక్తస్య చ చిత్తమ్ ॥

ఓ యింద్రాణీ! అల్లు గానిచో, నీ సౌందర్య ముత్కృష్ట మైనది, యసాధారణమైనది యని చెప్పవచ్చును. ఏ సౌందర్య మాతని చిత్తమును సులభముగా నపహరించుటకు సమర్ధ మగుచున్నదో దో

(ఆ సౌందర్య మసాధారణోత్కృష్టమైనదని యన్వయము.)

15. చక్షుర్దర్శనమాత్రన్నిస్తేజో విదధానమ్ ।
చిత్తం చోజ్ఝితధైర్యం మత్తానాం దనుజానామ్ ॥

ఓ దేవీ ! నీ నేత్రము తన వీక్షణ మాత్రముచేతనే మత్తులైన చిత్తములను ధైర్య తేజోవిహీనములుగా దనుజుల చేయు చున్నది.
16. గర్తే దుర్జనదేహే మగ్నాన్ పఙ్క్విలగ్నాన్ ।
ప్రాణానాత్మసజాతీనుద్ధర్తుం ధృతదీక్షమ్ ॥

దుర్జన దేహమ నెడి గోతిలో మునిగిపోయి, పాపపంకమందు చిక్కు వడిన ఆత్మసంబంధమగు ప్రాణముల నుద్ధరించుటకు దృఢ దీక్ష బూనిన వాక్యపూర్తికి తరువాత శ్లోకము చూడుడు.)
17. వజ్రం నిర్జరరాజో యద్ధత్తే సమరేషు ।
త్వచ్ఛక్తేః కలయైతన్మన్మాతర్నిరమాయి ॥

ఇంద్రుడు యుద్ధమున నెట్టి వజ్రాయుధము ధరించెనో అట్టి వజ్రము నీశక్తియొక్క కళచేతనే నిర్మింపబడెను.

(శరీరములందుండు వెన్నెముకకు వజ్రదండమని పేరు. దాని యందు శరీర వ్యాపారమును శాసించు నాత్మశక్తిప్రవాహము సుషుమ్నానాడి నాశ్రయించి యుండును. ఈ శక్తియే వజ్రా యుధశ క్తియై, యింద్రుడైన ఆత్మచే ధరింపబడినట్లుండును. దీని యనుగ్రహము బొందిన యోగికి శరీరమునంటిన పాపములు నశించి, నాడీగ్రంధులు వీడును. కవికి కపాలభిన్న సిద్ధినిచ్చిన దీ శక్తియే.)

18. రాజ్ఞీత్వాత్పరమేతే రాజత్వం శతమన్యోః ।
నిశ్శక్తిస్స వినా త్వాం కామాజ్ఞాం కురుతాం నః ॥

ఓ దేవీ ! నీవు రాజ్ఞి వగుట చేతనే ఇంద్రునకు రాజత్వము కలి గెను. నీవు లేనిచో నత డశక్తుడై మములు నెట్లాజ్ఞాపించగలడు?
19. సర్వం శక్రనిశాన్తస్యేశానే తవ హస్తే ।
అస్మాకం తు ధియేదం స్తోత్రం సఙ్గ్రహతస్తే ॥

ఓ తల్లీ ! ఇంద్రలోకమందున్న సమస్త విశేషము నీ హస్త మందే కలదు. ఈ స్తోత్రము మాకుండు బుద్ధిచే సంగ్రహముగా చేయబడుచున్నది.
20. గన్తవ్యం స్వరధీశే నిశ్శేషార్పణశూరమ్ ।
బిభ్రాణా నయసి త్వం మార్జాలీవ కిశోరమ్ ॥

ఓ తల్లీ ! మార్జాలకిశోరన్యాయమువలె పూర్తిగా నర్పించు కొనిన శూరుని నీవు భరించుచు గమ్యస్థానము జేర్చుచుంటివి. (భగవాన్ శ్రీ రమణమహర్షి యుదేశింపబడెను.)
21. గృహ్ణ్న్నమ్బరనాథామమ్బామశ్లథమన్ధః ।
కీశస్యేవ కిశోరో యోగీ గచ్ఛతి గమ్యమ్ ॥

ఆకాశమునకు ప్రభ్వివి, తల్లివి యైన నిన్ను విడువని పట్టుతో గ్రహించుచున్న యోగి మర్కట కిశోర న్యాయమున గమ్య స్థానము చేరుచున్నాడు. (స్వానుభవమును కవి పేర్కొ నెను)
22. పూర్ణాత్మార్పణహీనోఽప్యజ్ఞాతాఽపి సమాధేః ।
నిత్యం యో జగదమ్బ త్వాం సేవేత జపాద్యైః ॥

ఓ తల్లీ ! పూర్ణముగా ఆత్మార్పణము చేయనివాడైనను, సమాధి యందు జ్ఞానము లేనివాడైనను, యెవడు నిన్ను జపాదులతో నిత్యము సేవించుచుండునో,
23. తం చాచఞ్చలభక్తిం కృత్వా పూరితకామమ్ ।
నిష్ఠాం దాస్యసి తస్మై పౌలోమి క్రమశస్త్వమ్ ॥

ఓ యింద్రాణీ, వానిని నీ న చంచల భ క్తిగలవానిగా జేసి, సర్వ కామములను దీర్చి, వానికి క్రమముగా (ఆత్మ) నిష్ఠ నిత్తువు. (ఇరియు స్వానుభవమే)
24. భిన్నాం సఙ్ఘసహస్రైః ఖిన్నాం శత్రుభరేణ ।
పాతుం భారతభూమిం మాతర్దేహి బలం మే ॥

ఓ తల్లీ ! వేలకొలది సంఘములుగా విచ్ఛిన్నమై, శత్రు భార ముచే ఖన్ను రాలైన భారతదేశమును రక్షించుటకు మాకుబల మిమ్ము.
25. త్ర్యైలోక్యావనభారశ్రాన్తాం వాసవకాన్తామ్ ।
హైరమ్బ్యో మదలేఖాః సమ్యక్ సమ్మదయన్తు ॥

ముల్లోకములను భరించుటచే నలసియున్న ఇంద్రాణికి గణపతి యొక్క యీ మద లేఖావృత్తములు లెస్సగా ముదము గూర్చుగాక.