వసుమతి స్తబకము

  1. మోహం పరిహర న్యోగం వితనుతాం ।
    దేవేంద్ర దయితా హాసో మమహృది ॥

    మోహమును పరిహరించు ఇంద్రాణీహాసము నా హృదయమందు యోగమును జేయుగాక.
  1. ఆభాతు కరుణా సా భారత భువి ।
    సుత్రామ సుదృశో యద్వన్ని ఆ దీవి

    ఇంద్రాణి తన (నిజ) లోకమం దెట్టి కరుణ జూపునో (స్వర్గమందు),అట్టి కరుణనే భారత భూమియందామె చూపుగాక.
  1. వందారు జనతా మందార లతికాం !
    వందే హరిహయ ప్రాణప్రియతమాం ॥

    నమస్కరించువారికి గోర్కెలనిచ్చుచున్న దేవేంద్ర ప్రాణసఖని నేను కొలుచుచున్నాను.
  1. శోకస్య దమనీం లోకస్య జననీం !
    గాయామి లలితాం శక్రస్య దయితాం ।

    దుఃఖములను శమింప జేయునది, లోకమాతయు, ఇంద్రుని భార్యయు నగు సుందరిని నేను స్తుతించును.
  1. రమ్యా సుమనసాం భూపస్య మహిషీ ।
    సౌమ్యా జనిమతాం మాతా విజయతే ॥

    రమ్యయు, దేవేంద్రుని పట్టపు దేవియైనది, దేహధారులకు సౌమ్యమైనది యగు మాత ప్రకాశించుచున్నది.
  1. వీర్యస్యచ ధియ స్త్రైలోక్య భరణే ।
    దాత్రీ మఘవ తే దేవీ విజయ తే ॥

    త్రిలోకములను భరించుట కింద్రునకు బుద్ధిని, బలమును ఇచ్చు దేవి ప్రకాశించుగాక.
  1. వ్యాపా జగదిదం గుప్తా హృది నృణాం !
    ఆప్తా సుకృతినాం దైవం మమ శచీ ॥

    ఈ జగత్తునందు వ్యాపించియున్నది, మానవ హృదయము లందు గుప్తమై యున్నది, పుణ్మాత్ముల కాపురా లైనదియగు శచీ దేవి నా యొక్క దైవము.
  1. ఖేశక్తి రతులా పారే చిదమలా !
    స్వశ్చారు మహిళా దైవం మమశచీ ॥

    ఆకాశమందు నిరుపమానశక్తిగా నున్నది, ఆకాశమున కావల నిర్మల చిత్తుగా నున్నది, స్వర్గమందు సుందర స్త్రీగా నున్నది యగు శచీ దేవి నా యొక్క దైవము.
  1. శస్త్రం మఘవతో వస్త్రం త్రిజగతః ।
    శాస్త్ర స్తుతగుణా దైవం మమశచీ ।

    ఇంద్రునకు శస్త్రము, ముల్లోకములకు వస్త్రము (ఆకాశమే వస్త్రము) అగుచు, శాస్త్రములచే నుతింపబడు గుణములుగల శచీ దేవి నా యొక్క దైవము.
  1. యుక్తస్య భజత శ్శర్మాంత రతులం ।
    వర్మాపిచ బహి దైవం మమ శచీ ॥

    యోగయుక్తుడై భజించువాని యాంతర్యమున నిరుపమాన సుఖము నిచ్చుచు, బాహ్యమున కవచమై రక్షించు శచీదేవి నా యొక్క దైవము. (ఇంద్రాణీ విద్యాఫలమిది)
  1. వీర్యం బలవతాం బుద్ధి ర్మతిమతాం ।
    తేజో ద్యుతిమతాం దైవం మమ శచీ ॥

    బలవంతులందు వీర్యరూపముగను, మతిమంతులందు బుద్ధి రూపముగను, కాంతిమంతులందు తేజోరూపముగను నున్న శచీదేవి నా దైవము.
  1. ఏ కైవ జనయ స్త్యే కైవ దధతీ ।
    ఏకైవ లయకృ దైవం మమ శచీ ॥

    తానొక్క తెయే సృష్టి చేయుచు, తానే ధరించుచు (స్థితి), తానే లయ మొనర్చు శచీదేవి నా దైవము.
  1. శక్తీ రవితధాః క్షేత్రేషు దధతీ !
    బీజేషుచ పరా దైవం మమ శచీ ॥

    క్షేత్రములందు, బీజములందు గూడ వ్యర్ధముగాని శక్తులను ధరించు పరా దేవియైన శచి నా దైవము.
  1. చిన్వన్యపి పచం త్యేకా పశు గణం ।
    ఖాదంత్యపి భవే దైవం మమశచీ ।

    ఒక్క తెయైనను జీవరాసులందు వెతకుట, పచన మొనర్చుట,నాశన మొనర్చుట యను సంసారత్రయముగా నున్న శచీదేవి నా దైవము.
  1. దృష్టా ధృత చితి దృశ్యే తతగుణా ।
    విశ్వాత్మ మహిషీ దైవం మమశచీ ।

    దృష్టియందు ధరింపబడు చిత్స్వరూపిణి, దృశ్యములందు గోచ రించు గుణరూపిణి యగు దేవేంద్ర భార్యయైన శచి నా దైవము.
  1. రాకా శశిముఖీ రాజీవ నయనా !
    కాపి లలనా దైవం మమ శచీ ॥ •

    పూర్ణ చంద్రునివంటి ముఖము, పద్మముల బోలు నేత్రములు గలిగి స్వర్గమందుండు నొకానొక స్త్రీ యైన శచి నా దైవము.
  1. స్థాణావపి చరే సర్వత్ర వితతా ।
    సాక్షాద్భవతు మే స్వర్నాధ దయితా ॥

    స్థాణువులందు, చరవస్తువులందు సర్వత్ర వ్యాపించుఇంద్రాణి నాకు ప్రత్యక్ష మగుగాక.
  1. యన్మాతరనృతం జుష్టం గదితం ।
    ధ్యాతంచ హరమే తదేవి దురితం

    ఓ తల్లీ ! యే యనృతము (నాచే) పొందబడెనో, పలుక బ డెనో, ధ్యానించబడెనో, ఆ నా పాపమును హరింపుము.
  1. మాం మోచయ ఋణా దింద్రాణి సుభుజే ।
    మా మల్పమతయో మానిందిషు రజే ।

    ఓ యింద్రాణీ ! ఋణమునుండి నన్ను విముక్తుని గావింపుము. అల్పబుద్ధులు నన్ను నిందించకుందురుగాక.
  1. శత్రుశ్చ శచిమే సఖ్యాయ యతతాం ।
    దృప్తశ్చ మనుజో మామంబ భజతాం ॥

    ఓ యంబా ! శత్రువైన వాడు నా సఖ్యమునకు యత్నించుగాక, గర్వితుడు నన్ను సేవించుగాక.
  1. కష్టం శచి విధూ యేష్టం విదధతీ ।
    ఆనందయ జనం ప్రేయాం స మిహమే ॥

    ఓ శచీ! కష్టములను తొలగించి, యిష్టముల నిచ్చుదానవై నా కిచ్చటగల ప్రియజనులను సంతో షబరచుము
  1. అస్త్రం మమ భవ ధ్వంసాయ రటతాం ।
    సుత్రామ తరుణి శ్రీమాతర సతాం ।

ఓ తల్లీ ! ఆరచుచున్న దుర్మార్గుల వినాశముకొఱకు నా కస్త్రమగుము.

  1. సమ్పూరయతు మే సర్వం సురనుతా ।
    స్వర్గక్షితిపతేశ్శుద్ధాన్తవనితా

    దేవతలచే నుతింపబడు యింద్రాణి నా కోర్కెలనన్నిటిని సంపూర్ణ మొనర్చుగాక.
24. సంవర్ధయ శచి స్వం దేశమవితుమ్ ।
బాహోరివ హరేర్బుద్ధేర్మమ బలమ్

ఓ శచీ ! స్వకీయమైన దేశమును (స్వర్గమును) రక్షించుకొనుటకింద్రుని భుజములకు బలమిచ్చినట్లు, నా బుద్ధిబలమును వృద్ధిజేయుము
  1. ఏతైర్వసుమతీవృత్తైర్నవసుమైః ।
    భూయాచ్చరణయోః పూజా జనని తే

    ఓ తల్లీ ! ఈ వసుమతీ వృత్తములనెడి నూత్న కుసుమములచే నీ పాదములకు పూజయగుగాక.