ముకుళా స్తబకము

  1. పౌలోమ్యా శ్శుచయో హాసానాం ఘృణయః ।
    భూయాసు ర్విమల ప్రజ్ఞాయై హృది మే ॥

    ఇంద్రాణియొక్క శుభ్రమైన హాసకాంతులు నా హృదయమందు విమలమైన ప్రజ్ఞ నిచ్చుగాక.
  1. ఇంద్రాణ్యాః కరుణా లోకా శ్శోక హృతః ॥
    భూయాసు ర్భరత క్ష్మాయై క్షేమ కృతః ॥

    దుఃఖమును హరించు ఇంద్రాణీ కృపావలోకములు భారత భూమికి క్షేమకరము లగుగాక.
  1. వ్యక్తి ర్వ్యోమ తను శ్శక్తిత్వా ద్వనితా !
    జ్ఞాతృత్వా త్పురుషః పాంచి ద్విదుపాం ॥

    ఆకాశము శరీరముగా గలదొక వ్యక్తియనియు, శక్తిత్వమువలస వనితయనియు, జ్ఞాతృత్వముచే పురుషుడనియు కొందఱు పండి తుల యభిప్రాయము.

(ఒకే శరీరము శక్తి వురుషుల కన్వయింపబడెను.)

  1. వ్యక్తిం వ్యోమతనుం యేప్రాహుః పురుషం ।
    తేషాం తత్త్వవిదాం కల్పస్స్యా శ్రీ విధః !

    ఎవరు న్యోమతనువైనది వ్యక్తి యనియు, పురుషుడనియు చెప్పుచున్నారో, ఆ తత్త్వవేత్తలు మూడు విధములగు కల్పన తిరుగ చేయుచున్నారు. (ఎట్లనగా,)
  1. రుద్రం కేపి జగు శ్శక్రం కేపి విదుః ।
    భాషం తే భువన ప్రాణం కేపి విదః ॥

    కొందఱో పురుషుని రుద్రుడనియు, మఱికొందఱు ఇంద్రుడనియు నెఱుగుచున్నారు. ఇంకను కొందఱు లోకములకు ప్రాణమే యావ్యక్తి యందుకు.
  1. వ్యక్తిం వ్యోమతనుం ప్రాహుర్యే వనితాం ।
    తేషాంచ త్రివిధః కల్పశ్శాస్త్ర విదాం ॥

    న్యోమతనువు నెనకు వ్యక్తియనియు, వనితయనియు చెప్పుచున్నారో, ఆ శాస్త్రవేత్తలయందును కల్పన త్రివిధములుగా నున్నది. (ఎట్లనగా,)
  1. దుర్గా నూరివరైః కైశ్చిత్సా గదితా ।
    శచ్యవ్యౌర్విబుధై ధైరన్య్యె రదితిః ॥

    కొందఱిచే ఆ వనిత ‘దుర్గ’ యనియు, మఱికొందఱిచే ‘శచీ ‘యనియు, నింకను కొందఱిచే ‘అదితి’ యనియు చెప్పబడు చుండెను.
  1. ఏ కేషాం విదుషం వ్యక్తి ర్వ్యోమతనుః ।
    నస్త్రీ నో పురుషో బ్రహ్మై తత్సగుణం ॥

    కొందఱో వ్యోమతను వ్యక్తి స్త్రీయు కాదు, పురుషుడు కాదని, అది బ్రహ్మయొక్క సగుణరూప లక్షణ మనిరి.
  1. త్వం విశ్వస్య మహా నాణః కః పరమే ।
    త్వం రుద్రః ప్రణవ స్వం శక్రో2భ శిఖ ॥

    ఓ దేవీ ! నీవే విశ్వమునకు మహాప్రాణమవు, నీవే బ్రహ్మవు, రుద్రుడవు, ప్రణవమవు, ఇంద్రుడవు, వైద్యు తాగ్నివి,
  1. త్వం కస్యా స్యదితి స్వం రుద్రస్య శివా !
    త్వం శక్రస్య శచీ శక్తి స్సర్వ గతే ॥

    ఓ తల్లీ ! నీవు కశ్యపబ్రహ్మ కదితివైతివి, రుద్రునకు శిన వైతివి, యింద్రునకు శచి వైతివి. నీవే శక్తినై యుంటివి. (పురుషలక్షణమునుగూడ భరించు శక్తినైతివని భావము.)
  1. ప్రాణశ్చ ప్రణవో జ్యోతిశ్చాంబరగం ।
    వస్త్వేకం త్రిగుణం నోవస్తు త్రితయం ॥

    ప్రాణమని, ప్రణవమని, ఆకాశగత తేజస్సని త్రిగుణములతోనున్న దొకే వస్తువు, వస్తువులు మూడుగా లేవు.
  1. శక్తేరంబ పరే శక్తస్యాపి భిదా ।
    జ్వాలా పావకవ ద్భాషా భేదకృతా !

    ఓ యంబా ! శక్తికి, శక్తునకు భేదము జ్వాలకు, అగ్నికి గల భేదమువంటిది. మాటయే భేదమును గలిగించుచున్నది. (వస్తుతః `లేదని భావము.)
  1. సర్వం దృశ్య మిదం భుంజానే పరమే ।
    పుం నామ స్తుతయో యుజ్యంతే ఖలు తే ॥

    కనబడు సర్వము భుజించు నో దేవీ ! పురుషనామ స్తోత్రములు నీకు యుక్తమే కదా. (అయినను,)
  1. కుర్వాణేఒమ్బ సత స్సంతోషం సతతం ।
    స్త్రీనామ స్తుతయ శ్శోభాం తే దధతే ॥

    ఓ యంబా ! సద్రూపబ్రహ్మకు సంతోషమునిచ్చునట్టి నీకు స్త్రీ నామ స్తోత్రములు మాత్రము శోభనిచ్చుచున్నవి.
  1. సద్బహ్మ బ్రువతే విద్వాంసో విగుణం ।
    త్వం మాత స్సగుణం బ్రహ్మాజసి ప్రధితే ॥

    తల్లీ ! విద్వాంసులు గుణములేని దానిని సద్బహ్మగా చెప్పుచున్నారు. నీవు సగుణ బ్రహ్మ వైతివి. (8వ శ్లోక ముచూడుడు)
  1. శబాద్యై ర్వియుతం సత్ప్రృహ్మా 2 మలినం !
    శబ్దాద్యై స్సహితా త్వం దేవ్యార్యహితా ॥

    ఓ దేవీ ! శబ్దాదులతో గూడక యున్నది నిర్మల బ్రహ్మమగును.శబ్దాదులతో గూడిన నీ వార్యులకు హిత కారిణి వగుచుంటివి. (స్తుతింప వీలగు రూప మిదియే)
  1. సాక్షి బ్రహ్మ పకం త్వం మాతః కురు షే ।
    సర్వేషాం జగతాం కార్యం సర్వ విధం ॥

    ఓ తల్లీ ! పరబ్రహ్మము సాక్షిగా నుండును. నీవు సకల జగత్తులయొక్క సర్వవిధ కార్యములను జేయుదువు.
  1. ద్యౌర్మాతా జగతో ద్యౌ రేవాస్య పితా ।
    దృశ్యం విశ్వ మిదం వ్యాప్తం భౌతి దివా ॥

    జగత్తున కాకాశమే తల్లి, ఆకాశమే తండ్రి దృష్టిగోచరమగు సర్వము ఆకాశముచే వ్యాప్తమై ప్రకాశించుచున్నది.
  1. ఆకాశా ద్రజసో ద్యౌరన్యా విరజా ః !
    ఆకాశేస్తి పున స్తత్పారేచ పరా ॥

    ధూళిరూపమైన ఆకాశముకంటె ధూళిరహితాకాశము వేఱుగా గలదు. దాని కన్యమైన దింకొకటి యున్నది. ఈ మూడింటి కంత్యమందు పరాకాశము గలదు.

(పరాకాశము నిర్గుణము. అదియే గుణశ్రయమును బొంది మూడు స్థితులుగా వ్యాపించెను. 11వ శ్లోకము చూడుడు. వీనినే భూర్భువస్సువర్లోకము లనిరి. అంత్యమున కేవల మహి మమే పరాకాశమగును. సచ్చిదానంద త్రిరూపాత్మక వస్తు వీ విధముగా మహిమచే రూపత్రయలక్షణమై జ్యోతిరాకృతిగా ప్రకాశించినట్లు భావించవలెను.)

  1. తాం లోకస్య మహా రంగే వ్యోమతనుం ।
    పారే శుద్ధ తమాం విద్శస్త్వాం పరమే॥

    దేవీ ! లోకముల నెడి మహారంగమందా వ్యోమతనువును, దాని యంత్యమందు శుద్ధతమమైన నిన్నును తెలిసికొను చున్నాము.

(ఆమె పరాకాశ స్వరూపిణియైనను స్థూల - సూక్ష్మ - కారణ శరీరములు గల తనువును మనము పొందినట్లే త్రైవిధ్యమును బొందిన ఆకాశతనువుచే పొంది, యంతటను వ్యాపించెను. ఆ రూపమును ధ్యానించువారందలి పరదేవతాతత్వమును తెలియుదురు.)

  1. త్వాం పూర్ణామదితిం శక్తిం దేవి శచీం ।
    నిత్యం శబ్దవతీం గౌరీం ప్రబ్రువతే ।

    ఓ దేవీ! పూర్ణమైన నిన్న దితిగాను, శక్తిగాను, శచిగాను, ప్రణవముగాను, గౌరీ దేవిగాను వచించుచున్నారు.
  1. పుం నామా భవతు స్త్రీనామా2 స్వథవా
    వ్యక్తి ర్వ్యోమ తను శ్లోకం పాత్యఖలం ।

    పురుష నామ మగుగాక, స్త్రీ నామ మగుగాక. నామ మగుగాక. వ్యోమతిను వ్యక్తియే నిజలమును రక్షించుచున్నది.
  1. నాకేసాకిల భారత్యెంద్రీ రాజ్యరమా
    బిభ్రాణా లలితం స్త్రీరూపం పరమా !

    ఆమె లలితమైన స్త్రీరూపమును ధరించి యుత్తమ రాజ్యలక్ష్మిగాను, ఇంద్రాణిగను స్వర్గమున భాసించుచున్న ది.
  1. శక్తాం దేవి విధే హ్యార్తైనా మననే !
    ఇంద్రస్యేవ భుజాం వాసిష్ఠస్య మతిం ॥

    ఓ దేవీ! ఆర్తినొందినవారిని రక్షించుట కింద్రుని భుజమునకెట్లు సామర్ధ్యమిచ్చితివో, వాసిష్ఠుని మతి కట్లే శక్తినీయుమా. (భారతీయుల ఆ ర్తిని దొలగించుటకు)
  1. పూజా శక్రతకు ణ్యేతై స్పిక్యతు తే ।
    గాతౄణాం వర దే గాయత్రై ర్మకులైః ॥

    నిన్ను గానము చేయువారికి వరములిచ్చు నో యింద్రతకుణీ ! ఈ గాయత్రీ ఛందస్సంబంధ ముకుళ(వృత్త)ములచే నీకొనర్చు పూజ సిద్ధించుగాక.