కుమారలలితా స్తబకం

1. సురేశ్వరమహిష్యాః స్మితం శశిసితం మే ।
తనోతు మతిమచ్ఛాం కరోతు బలమగ్రయ్మ్ ॥

ఇంద్రాణియొక్క చంద్రునివంటి ధవళ స్మితము నా బుద్ధికినైర్మల్య మొసగి శ్రేష్ఠబలము నిచ్చుగాక.
  1. విధాయ రిపుధూతిం నిధాయ సుదశాయామ్ ।
    పులోమతనుజాతా ధినోతు భరతక్ష్మామ్ ॥

    శత్రునాశన మొనర్చి, భరత భూమిని మంచిదశకు తెచ్చి యింద్రాణి సంతోష పెట్టుగాక.
  1. పదప్రణతరక్షా విధానధృతదీక్షా ।
    జగద్భరణదక్షా పరా జయతి శక్తిః ॥

    తన పాదములందు నమ్రులైనవారిని రక్షించు విధానమందు దీక్షబూనినది, జగత్తును భరింప సమర్ధురాలైనది యగు పరా శక్తి ప్రకాశించుచున్నది
4. స్వరత్యవిరతం సా శనైర్నభసి రఙ్గే ।
జ్వలత్యధికసూక్ష్మం జగత్ప్రభవశక్తిః ॥

స్వర్గమం దెశ తెరపిలేకను. ఆకాశరంగస్థలముందు సూక్ష్మముగాను గల ఆ యింద్రాణీశక్తి యధికముగాను, సూక్ష్మము గాను బ్రకాశించుచున్నది.

(స్వర్గమందు స్పష్టముగా నున్నందున తేజస్సధికము. ఆ తేజము ఆకాశమందు తన సూక్ష్మత్వముచే తిరోధానమై యస్పష్టముగా నుండును.)

  1. మహస్తవ సుసూక్ష్మం నిదానమఖిలానామ్ ।
    భవత్యఖిలమాతర్జగత్యనుభవానామ్ ॥

    ఓ తల్లీ ! నీ యతిసూక్ష్మ తేజస్సు జగత్తునందు సకలానుభవములకు నిదానము (ఆధారము) అగుచున్నది.
  1. జనన్యనుభవానాం మతిత్వపరిణామే ।
    స్వరో భవతి మూలం తవాభ్రహయరామే ॥

    ఓ తల్లీ ! అనుభవములయొక్క జ్ఞాన పరిణామమునకు నీ స్వర మే మూల మగుచున్నది. (ప్రణవ శబ్దము జ్ఞానమునకు నేతకనుక)
  1. య ఈశ్వరి నిదానం సమస్తమతిభానే ।
    స్వరో గతివిశేషాత్స ఏవ ఖలు కాలః ॥

    ఓ యీశ్వరీ ! ఏ స్వరము సమస్త జ్ఞానమునకు మూలమో, ఆ స్వరమే గతివి శేషమువలన కాలమగును గదా !
  1. జ్వలన్త్యభిహితా త్వం విహాయసి విశాలే ।
    ప్రచణ్డపదపూర్వా ప్రపఞ్చకరిచణ్డీ ॥

    దేవీ ! విశాలమైన ఆకాశమందు నీవు ప్రీతిచే జ్వలించుచు ‘ప్రచండ’ పదము ముందుగల చండిపై ప్రకాశించుచుంటివి, (ఆకాశమందు మహిమచే జ్వలించుశక్తి ప్రచండచండి కనుక నే యీమె వైద్యుత శక్తి స్వరూపిణి.)
  1. స్వరన్త్యఖిలబుద్ధిప్రదా భవసి గౌరీ ।
    త్రికాలతనురమ్బ స్మృతా త్వమిహ కాలీ ॥

    ఓ యంబా ! స్వరరూపిణివై నను యజలమునకు బుద్ధి నిచ్చుచు ‘గౌరి ’ వైతివి. త్రికాలములే శరీరముగా గలిగి యిచ్చట ‘కాళి’గా స్మరింపబడుచుంటివి. (అనగా బుద్ధినిచ్చు చిచ్చాఖ యొకటి, నాదముచే పరిణామ ములను గల్పించు క్రియాశాఖ యింకొకటి.)
  1. మహస్స్వర ఇతీదం ద్వయం తదతిసూక్ష్మమ్ ।
    మహేశ్వరి తవాంశద్వయం పరమముక్తమ్ ॥

    ఓ యీశ్వరీ ! మహస్సు, స్వరము అను రెండును అతి సూక్ష్మములు. అవి యుత్కృష్టమగు నీయొక్క అంశద్వయముగా చెప్పబడుచున్నవి.
  1. మహోఽతిశయమాప్తం త్వయి త్రిదివగాయామ్ ।
    స్వరోఽతిశయమాప్తః సితాద్రినిలయాయామ్ ॥

    స్వర్గమును బొందిన నీ మహస్సు యున్నది. (ఆకాశముకంటె నివృత్తిచే వేతైన స్వర్గమందు మహస్పై ఆకాశముతో గూడిన భువనమందది సహస్సనబడును) అట్లే కైలాసమందు వసించు నీ స్వర మతిశయించుచున్నది. (స్వర్గములో మహస్సు విభూతి, కైలాసమందు ప్రణవము విభూతి)
  1. దివం నయతి పూర్వా భువం యువతిరన్యా ।
    ద్వయోః ప్రకృతిరభ్రం విశాలమతిమాన్యా ॥

    మొదట చెప్పబడిన దేవి (అనగా అతిశయించిన మహస్సు కలది) దివమును బొందించుచున్నది, తరువాత చెప్పబడిన దేవి భువమును బొందించుచున్నది. ( మొదటిది నివృత్తి స్వరూపిణి, రెండవది ప్రవృత్తి స్వరూపిణి.) ఈ రెండింటికి మూలముకొలన శక్యముగాని విశాలాకాశమే, (సచ్చిదానందమే)
  1. న తే దివి లసన్త్యాః పితా తనుభృదన్యః ।
    స్వయం భువమిమాం త్వాం సతామవని విద్మః ॥

ఆకాశమందు బ్రకాశించు నీ కితర శరీరధారియగుతండ్రి యెవ్వడులేడు. అట్టి నిన్ను మే మందువలన స్వయంభువగా తలచుచుంటిమి.

  1. సురారికులజన్మా తవేశ్వరి పులోమా ।
    పితేతి కవిభాషా పరోక్షగతిరేషా ॥

    ఓ యీశ్వరీ ! రాక్షసకులమందు బుట్టిన పులోముడు నీ తండ్రియను కవివచన మప్రమాణమైనది.

(పురాణములలో పులోము డింద్రాణి తండ్రిగా వచింపబడెను)

  1. వదన్త్యసురశబ్దైర్ఘనం సజలమేతమ్ ।
    పులోమపదమేకం పురాణసతితేషు ॥

    దేవీ ! జలయుక్తమైన మేఘ మీ యసురవాచక శబ్దములతో పిలువబడెను. అట్టి పదములలో ‘పులోమ’ పద మొకటి. (ఘనం అనగా మేఘము. నిఘంటువులో ‘ఘనం’ అను పద మునకున్న 32 పేళ్లలో ‘పులోమ’ అనునది యొకటి.)
  1. ప్రకృష్టతరదీప్తిర్గభీరతరనాదా ।
    ఇతో హి భవసి త్వం తటిత్తనురమేయే ॥

    ఓ తల్లీ! మునులకు గీర్తినిచ్చు నీవు అత్యధిక కొంతియు, గంభీరనాదమున్ను గలిగిన మెఱుపు రూపమున యీ మేఘము నుండి పుట్టితివి.

(కనుక పులోము డామెకు తండ్రి యనబడెను. కాని మెఱుపు రూపమైన విద్యుచ్ఛక్తి పులోముడను మేఘునకు బూర్వ మా కాశమందు తల్లివలెనున్న విషయమీ కవులు మరచిరి.)

  1. అరాతిరసురోఽయం విభోర్నిగదితస్తే ।
    హయశ్చ బతగీతః పితా తవ పయోదః ॥

    ఈ పులోమ రక్కసుడు నీ విభుని శత్రువుగా వచింపబడు చుండెను. నీ తండ్రియైన యీ మేఘము ‘హయ’ మనియు పిలువబడెను.
  1. ప్రియైః కిల పరే వాం పరోక్షవచనౌఘైః ।
    ప్రతారితమివేలా జగన్మునిగణేన ॥

    దేవీ ! విూ యుభయులను గుఱించి (ఇంద్రయింద్రాణీలగురించి) ప్రియమైన గూఢవాన్జాలముచే మునిగణము లీభూమిని వంచించి నట్లున్నది.
  1. నికృష్టమపి రమ్యం యది త్రిదివలోకే ।
    తవామ్బ కిము వాచ్యా రుచిస్త్రిదివనాథే ॥

    ఓ యంబా! నికృష్టమైన వస్తువుకూడ స్వర్గము దు రమ్యమై యున్నప్పు డింక స్వర్గాధీశ్వరివైన నీ కాంతినిగుఱించి చెప్పుట కేమున్నది.

20 . త్వమమ్బ రమణీయా వధూస్త్వమివ నాకే ।
త్వయా క ఇవ తుల్యాం మృదో వదతు లోకే ॥

తల్లీ ! స్వర్గమందు నీవంటి రమణీయ స్త్రీవి నీవే. ఈ మట్టిలోక మందింక నీకు సమానస్త్రీ నెవడు చెప్పగలడు ?

  1. వినీలమివ ఖాంశం విదుస్త్రిదివమేకే ।
    పరస్తు వదసి స్వః కవిః కమలబన్ధుమ్ ॥

    మిక్కిలి నీలమైన ఆకాశము స్వర్గమని కొందఱు భావించు చున్నారు. (నిర్మలాకాశము.) మఱియొక కవి సూర్యుడే స్వర్గ మనుచున్నాడు.
  1. అముత్రగతశోకే మహామహసి నాకే ।
    నమామ్యధికృతాం తాం పురాణకులకాన్తామ్ ॥

    ఊర్ధ్వమందున్నది, దుఃఖరహితమైనది, గొప్ప తేజస్సుగలది యగు స్వర్గము నధిష్టించిన ఇంద్రాణికి నేను నమస్కరించు చున్నాను.

(స్వర్గమునకు సరియగు నిర్వచన మీయబడెను. దీనినిబట్టి పెళ్లోకములో పేర్కొనబడిన నిర్వచనములు ఖండించబడినవగును)

  1. యదా మముతపక్వం మదీయమఘముగ్రమ్ ।
    తదిన్ద్రకులకాన్తే నివారయ సమగ్రమ్ ॥

    ఓ యింద్రాణీ ! పచ్చిగానున్నను, పక్వమైనను నాయొక్క ఉగ్రపాపము లేవిగలవో, అధికముగానున్న ఆ పాపములను సీవు నివారింపుము.
  1. దదాతు భరతక్ష్మావిషాదహరణాయ ।
    అలం బలముదారా జయన్తజననీ మే ॥

    ఉదార స్వభావురాలైన జయంతుని తల్లి (ఇంద్రాణి) భరత ఖండ విషాదహరణమునకై నా కత్యంత బలము నొసగుగాక.
  1. అతీవ లలితాభిః కుమారలలితాభిః ।
    ఇమాభిరమరేశప్రియా భజతు మోదమ్ ॥

    అతి సుందరమైన యీ కుమార లలితా వృత్తములవలన ఇంద్రాణి సంతోష మొందుగాక.